సమస్తానికి - ఆధారమైన యేసయ్య | Samastaniki - adharamaina yesayya | Telugu Christian Song Lyrics - Download

Samastaniki - adharamaina yesayya | సమస్తానికి - ఆధారమైన యేసయ్య | Telugu Christian Song Lyrics

సమస్తానికి - ఆధారమైన యేసయ్య 

సమస్తానికి - ఆధారమైన యేసయ్య 

కృపతో నన్ను - జ్ఞాపకం చేసుకోవయ్యా 

"ఏ దారిలో వెళ్లాలో తెలియక - ఆగిపోయానయ్యా 

మార్గము చూపించి - కరుణతో నడిపించు యేసయ్య" 


1. ఆత్మలోక్రుంగి అలసిననాకు - నీవే ఆధారము 

    నా వేదనలో ఒంటరి బ్రతుకులో - నీవే నా ఆశ్రయము 

    మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య 


2. గడచినా కాలం నీ మేలులను - నేను తలపోయగా 

    నీయందే నాకు ఆశలు చిగురించి - ఆనందమునిచ్చెను 

    మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య 


3. గాఢాంధకారం కమ్మినవేళ - నీవే నా దీపము

    కన్నీటి కెరటాలు నను ముంచువేళ - నీవే నా నిరీక్షణ 

    మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య