నా తోడుగా ఉన్నవాడవే | Na Thoduga Unnavadave | Telugu Christian Song Lyrics | Download

నా తోడుగా ఉన్నవాడవే | Na Thoduga Unnavadave | Telugu Christian Song Lyrics | Download

నా తోడుగా ఉన్నవాడవే

    నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపు వాడవే....//2// 

    నా పక్షమున నిలుచువాడవే...//2//           

    నా దైర్యము నేవె ఏసయ్యా.....//2// 

    యేసయ్యా ఏసయ్యా యేసయ్యా ఏసయ్యా కృతజ్ఞత 

    స్తుతులు నీకెనైయ్యా.....//2//.        ||నా తోడుగా|| 


1. నా అను వారు నాకు దూరమైనా.. 

    నా తల్లిదండ్రులే నా చేయి విడచినా...//2// 

    ఏ క్షణమైనా నన్ను మరవకుండా.....//2// 

    నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే....//2// ||నా తోడుగా|| 


2. నా పాదములు జారీనావేల.. 

    నీ కృపతో నన్ను ఆదుకుంటివే...//2// 

    నీ ఎడమ చేయి నాతల క్రింద ఉంచి...//2// 

    నీకుడి చేతితో నన్ను హత్తుకుంటివే ||నా తోడుగా|| 


3. హృదయము పగిలి వేదనలోన 

    కన్నీరు పొంగే పరిస్థితిలో.....//2// 

    ఒడిలో చేర్చి ఓదార్చువాడ....//2// 

    కన్నీరు తుడిచిన నా కన్న తండ్రివే..//2// ||నా తోడుగా||