చింత లేదిక యేసు పుట్టెను | Chinta Ledika Yeshu Puttenu | Telugu Christian old Song Lyrics | Download

Chinta Ledika Yeshu Puttenu, చింత లేదిక యేసు పుట్టెను, Telugu Christian old song lyrics, Telugu Christian songs, Jesus old songs in Telugu, Telugu devotional songs, Telugu Christmas carols, old Telugu Christian lyrics, Christian song lyrics Telugu, Yeshu songs Telugu, Telugu carol songs, Chinta Ledika lyrics, Christian devotional songs in Telugu

చింత లేదిక యేసు పుట్టెను

చింత లేదిక యేసు పుట్టెను

వింతగను బెత్లేహమందున

చెంత జేరను రండి సర్వ జనాంగమా

సంతసమొందుమా (2)


దూత తెల్పెను గొల్లలకు

శుభవార్త నా దివసంబు వింతగా

ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి

స్తుతులొనరించిరి ||చింత లేదిక||


చుక్క గనుగొని జ్ఞానులేంతో

మక్కువతో నా ప్రభుని కనుగొన

చక్కగా బేత్లేహ పురమున జొచ్చిరి

కానుకలిచ్చిరి ||చింత లేదిక||


కన్య గర్భమునందు పుట్టెను

కరుణగల రక్షకుడు క్రీస్తుడు

ధన్యులగుటకు రండి వేగమే దీనులై

సర్వ మాన్యులై ||చింత లేదిక||


పాపమెల్లను పరిహరింపను

పరమ రక్షకుడవతరించెను

దాపు జేరిన వారికిడు గుడు భాగ్యము

మోక్ష భాగ్యము ||చింత లేదిక||