దూత పాట పాడుడి | Doota paata paadudi | Christmas Song Lyrics Telugu | Jesus Song Lyrics | Download

Doota paata paadudi, దూత పాట పాడుడి, Christmas song lyrics Telugu, Telugu Christmas song, Christian song lyrics Telugu, Christmas carol Telugu, Telugu Christmas carol lyrics, Doota paata lyrics, Christmas song in Telugu, Telugu Christian carols

దూత పాట పాడుడి

దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి

ఆ ప్రభుండు పుట్టెను – బెత్లెహేము నందున

భూజనంబు కెల్లను – సౌఖ్య సంభ్రమాయెను

ఆకసంబు నందున – మ్రోగు పాట చాటుడి

దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి


ఊర్ధ్వ లోకమందున – గొల్వగాను శుద్దులు

అంత్య కాలమందున – కన్య గర్భమందున

బుట్టినట్టి రక్షకా – ఓ ఇమ్మానుయేల్ ప్రభో

ఓ నరావతారుడా – నిన్ను నెన్న శక్యమా

దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి


రావే నీతి సూర్యుడా – రావే దేవా పుత్రుడా

నీదు రాక వల్లను – లోక సౌఖ్య మాయెను

భూ నివాసులందరూ – మృత్యు భీతి గెల్తురు

నిన్ను నమ్ము వారికి – ఆత్మ శుద్ది కల్గును

దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి